హైదరాబాద్ లో బాలికపై సామూహిక అత్యాచారంమతిస్థిమితం లేని బాలికపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ శివారులోని కుత్బుల్లాపూర్‌ ప్రాంతంలో జరిగింది. బాధిత బాలిక రోడామేస్త్రీనగర్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తించిన అదే ప్రాంతానికి చెందిన యువకులు అక్బర్, జుమన్, గయాజ్, అలీంలు ఆమెను సమపంలోని ఓ పాడుబడిన భవనంలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత బాలికకు ఫోన్ ఇచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడించారు.దీంతో కంగారుపడిన వారు వెంటనే దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులు రెండు గంటల తర్వాత దేవేందర్‌నగర్‌లో బాలికను గుర్తించారు. అప్పటికీ ఆమెతోనే ఉన్న నిందితులు పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో మిగతా ముగ్గురిని కూడా ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post