గంగుల యువసేన ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే రసమయికరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణంలో మంత్రి గంగుల యువసేన జిల్లా అధ్యక్షుడు తోట కోటేశ్వర్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు బియ్యం నిత్యవసర సరుకులు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ లాక్ డౌన్ నేపథ్యంలో ఇండ్ల నుండి బయటకు రాని పరిస్థితిలో నిరుపేద కుటుంబాలను గుర్తించిన గంగుల యువసేన జిల్లా అధ్యక్షుడు తోట కోటేశ్వర్ సహకారంతో వారికి బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు ఇవ్వడం సంతోషకరమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి జువ్వాడి మన్ మోహన్ రావు, సర్పంచ్ దొడ్డు రేణుక మల్లేశం, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post