జనసేన సైనికులు పేదలకు నిత్యవసర వస్తువులు పంపిణిఆకలితో అల్లాడుతున్న పేదలకు జనసేన పార్టీకి చెందిన జిల్లా మహిళ అధ్యక్షురాలు సిహెచ్. శిరీష రెడ్డి , కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో పనులు లేక పస్తులు ఉంటున్న పేదల ఆకలిని తీర్చేందకు 300 మందికి నిత్యావసర వస్తువులను మరియు కూరగాయలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లాక్ డౌన్ నేపథ్యంలో ఆకలితో అల్లాడుతున్న పేదలకు తాము నిత్యావసర వస్తువులను మరియు కూరగాయలను అందిస్తామని ప్రజలకోసం జనసేన ఎపుడు ముందు వుంటుందన్నారు. జనసేన అధినేత అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి జిల్లా పోలీస్ శాఖ, వైద్యులకు,వైద్య సంస్థకు మరియు నగర పాలక సంస్థకు కోటి వందనాలను తెలియచేస్తున్నామన్నారు

ఇలాంటి మహమ్మారి అయిన కరోనా వైరస్ ఉన్నప్పటికీ వారి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సేవలను అందిస్తున్నారన్నారు. వైద్య సిబ్బంది వారు వారికి కుటుంబాలు ఉన్నపటికీ వారు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా రోగులకు పరీక్షలను నిర్వహించి వారు కోలుకునే వరకు వారికి మందులు ఇవ్వడం మాత్రమే కాకుండా వారికి మనోధైర్యంని కూడా నింపి వారు కోలుకునే విధంగా వైద్యం అందిస్తున్నారు. అదేవిధంగా నగరపాలక సంస్థ రోడ్లను పరిశుభ్రపరచడంలో మరియు పోలీసు శాఖ వారు ప్రజలకు అవగాహన కలిపించడంలో మరియు ఎవరిని లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంగించకూడదు అని వారు బాధ్యతారహితంగా ప్రజలు కోసం సేవ చేస్తున్నారన్నారు.

అదేవిధంగా జనసేన పార్టీ ఎమ్మెల్యె  అబేర్ధి కేతం రెడ్డి వినోద్ రెడ్డి కి ఉన్నతాధికారులందరికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ,మునిసిపల్ కనిషనర్, జిల్లా మీడియా మిత్రులకు ప్రజల కోసం వీధి వీధి తిరుగుతూ ప్రజలకు కరోన వైరస్ కు సంబంధించిన జాగ్రత్తలను పాటించాలని తెలియచేస్తున్నందుకు హృదయ పూర్వక ధన్యవాదాలను తెలిపారు. 

కరోనా వైరస్ పై ప్రజలందరూ ఉమ్మడి పోరాటం సాగించాలని,ఎవరికి వారు ఇళ్లలోనే ఉండటం, ఒకరికి ఒకరు సామాజిక దూరం పాటించటం తప్పనిసరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్,రమణ,మరియు నాని తదితరులు పాల్గొన్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post