యాస్వాడ గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని యాస్వాడ  గ్రామ పంచాయతీ పాలకవర్గ ఆధ్వర్యంలో 68 కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులు రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్ చేతుల మీదుగా పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి  రేషన్ కార్డు ఉన్న వారికి ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం తో పాటు ప్రతి రేషన్ కార్డు కు 1500 రూపాయలు ఇచ్చిందని తెలిపారు అలాగే మే నెలలో కూడా ఇస్తుందని అన్నారు యాస్వాడ గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు బియ్యం అందజేయడం అభినందనీయమని అన్నారు అనంతరం ఓరుగంటి ఆనంద్ గ్రామ సర్పంచ్ జక్కనిపల్లి మధుకర్, ఉప సర్పంచ్ సోమిరెడ్డి రఘునాథ్ రెడ్డి ని శాలువాతో సన్మానించారు ఈకార్యక్రమంలో ఎంపిపి ల ఫోరం జిల్లా అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి, జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, సహకార సంఘం చైర్మన్ అల్వాల కోటి, వివిధ గ్రామాల సర్పంచులు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post