షూటింగులకు అనుమతించాలని తలసానిని కోరిన టీవీ ఛానళ్ల ప్రతినిధులు - నిబంధనలను పాటిస్తూ షూటింగులు నిర్వహిస్తాంలాక్ డౌన్ కారణంగా సినిమా, సీరియళ్లతో పాటు టీవీ ఎంటర్ టైన్మెంట్ ప్రోగ్రాముల షూటింగులు కూడా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పలు ఛానళ్ల ప్రతినిధులు కలిశారు.లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్ల వద్దే ఉంటున్నారని... వారికి ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు షూటింగ్ లకు అనుమతించాలని ఈ సందర్భంగా మంత్రిని ఛానళ్ల ప్రతినిధులు కోరారు. ఈమేరకు వినతిపత్రం అందించారు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ షూటింగ్ లను నిర్వహిస్తామని చెప్పారు. వారి విన్నపంపై సానుకూలంగా స్పందించిన తలసాని... ఈనెల 5న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
Previous Post Next Post