మండలంలో జెడ్పీ చైర్మన్ ఆకస్మిక పర్యటనభద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో పర్యటించిన జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య. పర్యటనలో భాగంగా పెద్ద ఆర్లగూడెం పంచాయతీలోని రేగుంట గ్రామంలో ఉపాధి హామీ పని ప్రాంతంలో కూలీలను కలిసి లాక్ డౌన్ సమయంలో వారు ఎదుర్కొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే ఉచిత బియ్యం నగదు అందరికీ అందేలా చూడాలని సబందిత అధికారులను ఆదేశించారు. ఎండలు బాగా ఉన్నందున ఉపాధి హామీ పని సమయంలో  తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ  కార్యక్రమంలో జడ్పిటిసి సీతమ్మ, ఎంపీపీ రేస్ లక్ష్మి,  ఎంపీడీవో మల్లేశ్వరి, ఏపీవో సుకన్య,  సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Previous Post Next Post