ఉరి వేసుకొని యువకుడు మృతిభద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మడలం: చర్ల మండలం కొయ్యూరు గ్రామానికి చెందిన యువకుడు ఉరి వేసుకొని బలవన్మరణం చెందిన ఘటన ఆదివారం జరిగింది. మండలంలోని కొయ్యూరు గ్రామానికి చెందిన ఇప్ప. రామారావు కుమారుడు ఇప్ప.రవి చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గల సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్ నందు గల విద్యార్థులకు  క్రీడలలో శిక్షణ ఇస్తూ ఉంటాడు. ప్రతి రోజులాగే తెల్లవారుజామున వాకింగ్ నిమిత్తం బయటకు వచ్చిన రవి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా కళాశాల హాస్టల్ భవనంలోని ఒక గదిలో వెంటిలేటర్ కు ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. చలాకీగా ఉంటూ నలుగురితో కలిసిమెలిసి ఉండే యువకుడు ఇలా బలవన్మరణం చెందడం చూసి కొయ్యూరు గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Previous Post Next Post