స్వస్థలానికి వెళ్లేందుకు హైదరాబాద్ పోలీసుల ఈ-పాస్ విధానం అందుబాటులోకి : తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డికాగా, రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు అనుమతిస్తూ, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిన తరువాత, లాక్ డౌన్ కారణంగా చిక్కుబడిపోయిన టూరిస్టులు, యాత్రికులు, విద్యార్థుల సౌకర్యార్థం ఈ విధానాన్ని తీసుకుని వచ్చామని మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఒక కుటుంబానికి చెందిన వారికి రోజుకు ఒక పాస్‌ మాత్రమే జారీ చేస్తామని, కావలసిన వారు పేరు, మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నెంబర్, చిరునామా తదితర వివరాలు ఇవ్వాలని కోరారు. పాస్ పొందిన తరువాత వారు తమ సొంత ప్రాంతాలకు వెళ్లొచ్చని డీజీపీ తెలిపారు.

Previous Post Next Post