కుప్పకూలిన ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానం - సురక్షితంగా బయటపడ్డ పైలట్ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన మిగ్-29 మల్టీరోల్ ఫైటర్ జెట్ విమానం కుప్పకూలింది. పంజాబ్ లోని జలంధర్ లో ట్రైనింగ్ కార్యక్రమం సందర్భంగా క్రాష్ అయింది. అయితే, ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. వెంటనే అతన్ని రెస్క్యూ హెలికాప్టర్ లో తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు మాట్లాడుతూ, సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని... ప్రమాదంపై విచారణకు ఆదేశించామని తెలిపారు. మిగ్-29 విమానాలు సోవియట్ కాలానికి చెందినవి. 1999 లో జరిగిన కార్గిల్ యుద్ధంలో ఇవి పాలుపంచుకున్నాయి. బాంబింగ్ మిషన్స్ లో పాల్గొనే ఇతర యుద్ధ విమానాలకు ఎస్కార్ట్ గా కూడా వీటిని వినియోగిస్తున్నారు. పాత తరానికి చెందిన వీటిని లేటెస్ట్ టెక్నాలజీతో అప్ గ్రేడ్ చేశారు. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ మిషన్స్ లో పాల్గొనేలా అభివృద్ధి చేశారు.

Previous Post Next Post