టివి సీరియళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం - నేటి నుండి షూటింగ్స్ ప్రారంభంకరోనా లాక్‌డౌన్‌తో మూతబడిన చెన్నై టీవీ పరిశ్రమ మళ్లీ తెరుచుకోబోతోంది. టీవీ సీరియళ్ల షూటింగ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గరిష్టంగా 20 మందితో షూటింగ్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, అంత కొద్దిమందితో షూటింగ్ సాధ్యం కాదని, కనీసం 60 మందితో కూడిన షూటింగులకు అనుమతి ఇవ్వాలని ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, టీవీ నిర్మాతల మండలి అధ్యక్షురాలు సుజాత విజయ్‌కుమార్, కార్యదర్శి కుష్బూ తదితరులు ప్రభుత్వాన్ని కోరారు.వారి విజ్ఞప్తిని పరిశీలించిన ముఖ్యమంత్రి శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, షూటింగ్ నిర్వహించే ప్రదేశాల్లో ఆయా జిల్లాల అధికారుల అనుమతి తప్పనిసరని ప్రభుత్వం పేర్కొంది. నేటి నుంచే షూటింగులు నిర్వహించుకోవచ్చని ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు. 
Previous Post Next Post