సరిహద్దుల్లోనే తవ్వకాలు - ఏపీ వాహనాలను సీజ్ చేసిన తెలంగాణ అధికారులు!కృష్ణా జలాలకు సంబంధించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అంశం రెండు రాష్ట్రాల్లో వేడి పుట్టిస్తోంది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో రెండు రాష్ట్రాల మధ్య మరో కొత్త వివాదం తలెత్తింది.కర్నూలు జిల్లా గుండ్రేవుల వద్ద తుంగభద్ర నదిలో ఇసుకను తవ్వేందుకు వెళ్లిన ఏపీ వాహనాలను తెలంగాణ అధికారులు సీజ్ చేశారు. ఈ అంశం ఉద్రిక్తతకు దారి తీసింది. తెలంగాణ అధికారుల తీరుపై ఏపీ అధికారులు అసహనం వ్యక్తం చేశారు. అంతర్ రాష్ట్ర ఇసుక సరిహద్దులను గుర్తించేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు గతంలో సర్వే చేశారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా మైనింగ్ అధికారులు మాట్లాడుతూ, ఏపీ సరిహద్దుల్లోనే ఇసుక తవ్వకాలు జరిగాయని తెలిపారు. ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.

0/Post a Comment/Comments

Previous Post Next Post