స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కృష్ణ వర్మ ఆత్మహత్యశ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా పని చేస్తున్న కృష్ణ వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. విశాఖపట్టణంలోని బీచ్ రోడ్డులో ఉన్న తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేశారు.ఎంవీపీ పోలీస్ స్టేషన్ సీఐ షణ్ముఖరావు మాట్లాడుతూ, కృష్ణ వర్మ కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆయన భార్య ఫిర్యాదు చేశారని, ఈ మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. వర్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించామని అన్నారు. కాగా, అనారోగ్య కారణాలతో కృష్ణ వర్మ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఆయనకు గుండె ఆపరేషన్ అయినట్టు సమాచారం.

0/Post a Comment/Comments

Previous Post Next Post