15వ ఫైనాన్స్ నిధుల నుండి 25 శాతం నిధులు మండల పరిషత్ లకు ఇవ్వాలని కలెక్టర్ శశాంక ను కలిసిన ఎంపీపీలుకరీంనగర్ జిల్లా: మండల పరిషత్ లకు పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి 25 శాతం నిధులు కేటాయించాలని ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు  ప్రభాకర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి కోరారు ఈ సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శశాంక ను కలిసి వారికి వినతిపత్రం అందజేశారు మండల పరిషత్ లకు నిధులు కేటాయింపులు లేక నామమాత్రముగా ఉండిపోయి పరిస్థితి ఉందని దీంతో అత్యవసర పనులను చేపట్టలేక పోతున్నామని పేర్కొన్నారు 15వ ఆర్థిక సంఘం నుంచి మండల పరిషత్ లకు కేంద్రం ప్రభుత్వం 25 శాతం నిధులను కేటాయించాలని సిఫార్సు చేసిందని ఈ మేరకు కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన ఎంపీలు నాయకులు పాల్గొన్నారు
Previous Post Next Post