24 గంటల్లో... 380 మంది మృతి... 10 వేలకు పైగా కొత్త కరోనా కేసులు!ఇండియాలో కరోనా ఉద్ధృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. కేంద్ర వైద్యశాఖ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు, గడచిన 24 గంటల్లో 10,667 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 10,215 మంది రికవరీ కాగా, 380 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,53,178 యాక్టివ్ కేసులుండగా, 1,80,013 మంది రికవరీ అయ్యారని, 9,900 మంది మరణించారని అధికారులు గణాంకాలు విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకూ దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,43,091కి చేరుకున్నట్లయింది.

Previous Post Next Post