బ్రేకింగ్ : మంత్రి హరీష్ రావు పిఏకు కరోనా పాజిటివ్.!మంత్రి హరీశ్ రావు పీఏ కూడా కరోనా బారిన పడ్డారని ప్రచారం జరుగుతోంది. కాగా ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉండే మంత్రి హరీశ్ రావు సిద్దిపేట పీఏకు కరోనా సోకినట్టు  వార్తలు రాగానే అందరూ ఆశ్చర్యపోయారు.  ఇందులో భాగంగానే సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. ఈ మధ్య కాలంలో జడ్పీటీసీలు కలెక్టర్‌ను కలవగా వారితో వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆ కరోనా బాదితుడు హైదరాబాద్‌‌లో చికిత్స పొందుతున్నాడు .ఈ విషయం గురించిన సమాచారం రావడంతో వెంటనే కలెక్టర్ కూడా సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌తోపాటు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కూడా ఇంటికి పరిమితమయ్యారు. యాదాద్రి జిల్లా సీఈవోకు కరోనా సోకడంతో ఇంట్లో నుంచే పని చేయాలని కలెక్టర్ నిర్ణయించారు. గత కొన్ని రోజులుగా మంత్రి హరీష్ రావు  అందరికీ అర్థమయ్యే జాగ్రత్త చర్యలను వివరిస్తున్నారు. నిరంతరం జనంలో తిరుగుతూ వారికి అండగా నిలుస్తున్నారు.
Previous Post Next Post