నేటి నుంచి మోదీ వీడియో కాన్ఫరెన్స్ - కాన్ఫరెన్స్ కు హాజరు కాలేను: వైఎస్ జగన్నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ, అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుండగా, ఈ సమావేశానికి తాను హాజరు కాలేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయానికి ఆయన సమాచారం పంపారు.తమ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని ప్రస్తావించిన జగన్, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ సమావేశాలను సాధ్యమైనంత త్వరగా ముగించాల్సి వుందని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను సభలో ఉండటం తప్పనిసరైన నేపథ్యంలో ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనలేనని జగన్ పేర్కొన్నట్టు సమాచారం.

Previous Post Next Post