జమ్మూ కాశ్మీర్ లో ఎన్కౌంటర్ ... ఇద్దరు ఉగ్రవాదులు హతంజమ్మూకశ్మీర్‌లోని కుల్గం జిల్లా నిపొరా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించగా, గమనించిన ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.మరోవైపు, పుల్వామా జిల్లా త్రాల్ పరిధిలోని గులాబ్ బాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. తనిఖీలు మరిన్ని ప్రాంతాల్లోనూ కొనసాగుతాయని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. కాగా, గత రెండు వారాల్లో 25 మందికి పైగా ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది.
Previous Post Next Post