నేలరాలుతున్న చైనా డ్రోన్లు...చైనా విశ్వసనీయతపై సందేహాలుప్రపంచంలో ఏమూలకు వెళ్లినా చైనా తయారీ వస్తువు ఏదో ఒకటి కనిపిస్తుంది. చైనా ప్రబల ఆర్థిక శక్తిగా ఎదగడానికి అక్కడి వస్తు తయారీ రంగం ఎంతో ఊతమిచ్చింది. ఆధునిక టెక్నాలజీకి పర్యాయపదంలా నిలుస్తున్న డ్రోన్లను కూడా చైనా భారీ ఎత్తున తయారుచేసి అనేక దేశాలకు విక్రయించింది. అయితే కొంతకాలంగా, పలు దేశాల్లో చైనా తయారీ డ్రోన్లు కుప్పకూలుతున్న ఘటనలు ఎక్కువయ్యాయి. గాల్లోకి లేచిన తర్వాత సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో, నేలపై నుంచి వాటిని నియంత్రించేందుకు ఆటంకాలు ఏర్పడుతున్నట్టు గుర్తించారు. చైనా నుంచి డ్రోన్లను కొనుగోలు చేసిన దేశాల్లో పాకిస్థాన్, అల్జీరియా, ఇరాక్ వంటి దేశాలున్నాయి. ఇటీవలే అల్జీరియా పెద్ద సంఖ్యలో చైనా డ్రోన్లను దిగుమతి చేసుకుంది. వాటిలో మూడు డ్రోన్లు ఇటీవలే నేలరాలాయి. ఇలా వరుసగా చైనా డ్రోన్లు కూలిపోతుండడంతో, చైనా ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం విశ్వసనీయతపై సందేహాలు తలెత్తుతున్నాయి. కాగా, అంతర్జాతీయంగా ఓ అంశం విపరీతంగా ప్రచారంలో ఉంది. దాని సారాంశం ప్రకారం.... చైనా డ్రోన్ తయారీ టెక్నాలజీని ఇరాన్ నుంచి పొందింది. ఈ సాంకేతికతను ఉపయోగించే చైనా డ్రోన్లు తయారుచేస్తోందట.
Previous Post Next Post