సూర్యాపేట లో కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు.... రిసీవ్ చేసుకున్న సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్....హైదరాబాద్: భారత్ - చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు భౌతికకాయం ఇవాళ స్వస్థలానికి తరలించనున్నారు.. సంతోష్ పార్థీవదేహం  ఆర్మీ ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనుంది.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సూర్యాపేట్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్టు.. జిల్లా కేంద్రంలోని హిందూ శ్మశానవాటికలో సంతోష్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు సూర్యాపేట్ జిల్లా కలెక్టర్ తెలిపారు. మరోవైపు.. కాసేపటి క్రితమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు కల్నల్ సంతోష్‌బాబు భార్య సంతోషి.. ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ వచ్చిన ఆమెను రిసీవ్ చేసుకున్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్..
Previous Post Next Post