బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తులకు జైలు శిక్షకరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ కి చెందిన మొలుగూరి నర్సయ్య, మొలుగూరి పుష్ప మొలుగూరి శకుంతలను గతంలో ఎస్సై ఆవుల తిరుపతి 6 నెలల వరకు శాంతిభద్రతలకు భంగం కలిగించకుండా మండల తాహశీల్దార్  ముందు 107 CrPC క్రింద బైండోవర్  చేయడం జరిగినది. పై వ్యక్తులు బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి తిరిగి శాంతిభద్రతలకు భంగం కలిగించడం జరిగినది  అట్టి వ్యక్తులపై చర్య తీసుకోవాలని ఎస్సై  తిరుపతి తాహశీల్దార్ ను కోరగా,107 CrPC నిబంధనలు ఉల్లంఘించినందుకు తాహశీల్దార్  వారికి ఒక నెల జైలు శిక్ష విధించడం జరిగింది. తాహశీల్దార్ ఆదేశానుసారం పోలీసులు వారిని ఈరోజు జైలు కు పంపించడం జరిగింది
Previous Post Next Post