నేడు కేసీఆర్... కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి సాయం అందజేత!తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేడు సూర్యాపేట వెళ్లి కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 2 గంటలకు సూర్యాపేట చేరుకుంటారు.అనంతరం కల్నల్ సంతోష్‌బాబు నివాసానికి చేరుకుని ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సంతోష్ కుటుంబానికి ఇప్పటికే ప్రకటించిన రూ. 5 కోట్ల నగదు, అతడి భార్య సంతోషినికి గ్రూప్-1 స్థాయి ఉద్యోగానికి సంబంధించిన ఉత్తర్వుల ప్రతిని అందించనున్నారు. అలాగే, హైదరాబాద్‌లోని షేక్‌పేటలో కేటాయించిన ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలను కూడా అందిస్తారు.
Previous Post Next Post