దుబాయ్ లో కరోనాతో మృతి చెందిన కరీంనగర్ జిల్లా వాసి కుటుంబానికి ఆర్థిక సహాయంకరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం జగ్గయ్య పల్లి గ్రామానికి చెందిన ఉయ్యాల పర్శరాములు గౌడ్ కరోన వైరస్ తో ఈ నెల 13 వ తేదీన దుబాయ్ దేశం లో మరణించగా బుధవారం బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి  పోతుగంటి సుజాత రెడ్డి  మృతుని భార్య పిల్లలను పరామర్శించి 5000 రూ ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ సందర్బంగా సుజాత రెడ్డి మాట్లాడుతూ కులవృత్తి ఆదుకొక పోవడమతో ఆర్ధికంగా నష్టపోయి భార్యా పిల్లల పోషణ కోసం ఉన్న ఊరిని అందరిని వదిలి అప్పు చేసి 4 సంవత్సరాల క్రితం పర్శరాములు దుబాయ్ కి వెళ్లాడని  కొంత కాలం క్రితం కన్న తండ్రి చనిపోయినా రాలేనిపరిస్థితులలో ఉన్నాడని చివరకు కరోన వ్యాధితో ఈ నెల 13 న చనిపోయాడని దుబాయ్ నుండి అతని మిత్రులు తెలియ పరచారన్నారు  కరోన తో మృతి చెందడంతో అతన్ని కడసారి చూపుకు కూడా బార్యాపిల్లలు నోచుకోలేదని అన్నారు .ప్రస్తుతం వారి కుటుంబ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందని అన్నారు .అతను పనిచేసిన దుబాయ్ లోని FNC కంపనీ నుండి వారికి ఆర్థిక సహాయానికి అందించే విధంగా ప్రభుత్వ పరంగా  కృషి చేయాలన్నారు అదేవిధంగా మన ప్రభుత్వం నుండి వారి కుటుంబానికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు మరియు వారి ఇరువురు పిల్లలకి రెసిడెన్షియల్ పాఠశాలలో ఉచిత విద్యను అందించాలని కోరారు అదేవిదంగా దుబాయ్ లో అతను మరణించిన rasheed hospital నుండి అతని పార్థీవ శరీరాన్ని తెప్పించే వీలు అవుతుందో తెలుసుకోవాలని సుజాత రెడ్డి కోరారు మరియు ఆత్మీయులు ఎవరయినా వారి భార్యా పిల్లలకు ఆర్థిక సహాయాన్ని అందించాలనుకుంటే అతని భార్య అకౌంట్ కు డబ్బులు పంపాలని కోరారు 

SBI a/c no. 20160053299

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీ కొండూరి అనిల్ కుమార్ పోతుగంటి శారద పల్నాటి శైలజ ఉయ్యాల అంజన్న వడ్లకొండ వినయ్ రాజు .బత్తిని రాజు పర్శరాములు అనిల్ కరుణాకర్ లు పాల్గొన్నారు
Previous Post Next Post