అల్గునూర్, సదాశివపల్లి గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలి: మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలోని అల్గునూర్ మరియు సదాశివపల్లి గ్రామాల అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు కేటాయించాలని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను కోరారు హైదరాబాద్ సోమవారం కేటీఆర్ అధ్యక్షతన  కరీంనగర్ మరియు నిజామాబాద్ జిల్లాల కార్పొరేషన్ల అభివృద్ధిపై ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీసీ మరియు పౌరసరఫరాల శాఖామంత్రి గంగుల కమలాకర్,ఎమ్మెల్యే రసమయి హాజరయ్యారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అల్గునూర్ చౌరస్తాలో  ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఐలాండ్, స్వాగత తోరణం మరియు ఫిష్ మార్కెట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కేటీఆర్  దృష్టికి తీసుకెళ్లారు తిమ్మాపూర్ నుంచి అల్గునూర్  మీదుగా సదాశివపల్లి వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని అదే విధంగా అల్గునూర్ మరియు సదాశివపల్లి గ్రామాలలో సీసీరోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి  ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  కేటీఆర్ ని కోరారు
Previous Post Next Post