మూర్ఖుడి చేతిలో తెలంగాణ తల్లి బందీ అయింది...బద్దలు కొడతాం: బండి సంజయ్తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను 'మూర్ఖుడు' అంటూ దుయ్యబట్టారు.'కేసీఆర్ అనే మూర్ఖుడి చేతిలో తెలంగాణ తల్లి బందీ అయింది. నీళ్లు, నిధులు, నియామకాల ఆశయంతో ఏర్పడిన తెలంగాణలో... ప్రజలు అన్నింటా వంచనకు గురవుతున్నారు. మోసాలు, అబద్ధాలతో కేసీఆర్ కాలం గడుపుతున్నారు. రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరుల ఆశయాలు నెరవేర్చేలా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మలిదశ ఉద్యమాన్ని చేపడతాం. కేసీఆర్ గడీలను బద్దలు కొడతాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి బీజేపీ కంకణం కట్టుకుంది. బీజేపీకి ప్రజలంతా అండగా ఉన్నారు' అని ఆయన ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు.
Previous Post Next Post