కల్నల్ సంతోష్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షలు వి.సుధాకర్భారత్, చైనా బలగాల మధ్య లడఖ్ లోని వాస్తవాధీన రేఖ వద్ద జరిగిన ఘర్షణల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు వీరమరణం పొందారు. ఈ ఘటనపై ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాయితీయ అధ్యక్షులు వి. సుధాకర్   దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డ దేశం కోసం ప్రాణత్యాగం చేశాడని కీర్తించారు. సంతోష్ త్యాగం వెలకట్టలేనిదని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Previous Post Next Post