గన్నేరువరం మండలంలో భారీ శబ్దం- ఊపిరిపీల్చుకున్న ఉపాధి కూలీలు - సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులుకరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివాని పల్లె గ్రామ శివారులోని పారువెల్ల రోడ్డు మార్గంలో గుర్తుతెలియని వ్యక్తులు వ్యవసాయ భూమిలో టిగార్డ్ ఈడి లు సంచి పెట్టి పోయారు గురువారం ఉపాధిహామీ కూలీలు పనిచేస్తుండగా కునవాని పల్లె  గ్రామానికి చెందిన వ్యక్తి ఆ సంచి కి అగ్గి పెట్టాడు ఆ సంచి అంటుకుని భారీ శబ్దం రావడంతో ఉపాధి హామీ కూలీలు పరుగులు తీశారు ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అయితే తిరిగి శుక్రవారం ఉపాధి కూలీలు వచ్చి అధికారులకు తెలియజేయగా కార్యదర్శి రాజేందర్ ఎస్సై ఆవుల తిరుపతి కి సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది


Previous Post Next Post