సీతా రామాంజనేయ విగ్రహం ప్రత్యక్షం- పూజలు నిర్వహించిన మైలారం గ్రామ ప్రజలుకరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామ శివారులోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ సమీపంలో కళ్యాణ మండపం నిర్మాణం కోసం జెసిబి తో పనులు నిర్వహించగా అందులో ఆరు అడుగుల సీతా రామాంజనేయ స్వామి రాతి విగ్రహం బయటపడింది దీంతో అక్కడే ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ వరాల పరుశరాములు గ్రామ ప్రజలకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న గ్రామ ప్రజలు కమిటీ సభ్యులు తో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ సీతారామాంజనేయ రాతి విగ్రహం శాతవాహనుల కాలం నాటి విగ్రహంగా భావిస్తున్నామని త్వరలోనే గుడి నిర్మాణానికి ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గంగుల యువసేన జిల్లా అధ్యక్షుడు తోట కోటేశ్వర్, టిఆర్ఎస్ మండల నాయకులు దొడ్డు మల్లేశం, మాజీ సర్పంచ్ గువ్వ వీరయ్య ,మర్రి వెంకటమల్లు, శ్రీనివాస్, సత్తయ్య, ఓదేలు, రాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Previous Post Next Post