దెయ్యం వ్యాయామం చేస్తోందంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ - అసలు విషయం తేల్చిన పోలీసులుసోషల్ మీడియాలో కొన్ని వీడియోలు నిజమేనని నమ్మించేంత స్థాయిలో ఉంటాయి. ఉత్తరప్రదేశ్ లోని ఓ ఓపెన్ జిమ్ లో వ్యాయామ పరికరం ఒకటి దానంతట అదే కదులుతున్న వీడియో కూడా ఈ కోవలోకే వస్తుంది. సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన చాలామంది...  దెయ్యం ఎక్సర్ సైజులు చేస్తోందని ప్రచారం చేయడంతో వీడియో వైరల్ గా మారింది. దీనిపై యూపీలోని ఝాన్సీ పట్టణ పోలీసులు విచారణ జరిపి, అది దెయ్యం పనికాదని తేల్చారు. భుజబలం పెంపొందించుకునేందుకు ఉపయోగించే ఆ జిమ్ పరికరానికి ఎక్కువమోతాదులో గ్రీజును పూసి, దాన్ని వేగంగా కదిపి వీడియో చిత్రీకరించారని పోలీసులు గుర్తించారు. ఇది ఆకతాయిల పనే అని, పరికరానికి గ్రీజు ఎక్కువ పూస్తే దాని కదలికల్లో వేగం పెరుగుతుందని ఝాన్సీ పోలీసులు వెల్లడించారు. అంతేకాదు, పోలీసులు కూడా గ్రీజు పూసి ఈ పరికరాన్ని పరీక్షించి చూశారు.
Previous Post Next Post