బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశం పాల్గొన్న బిజెపి జిల్లా కో ఆర్డినేట్ మెంబర్ కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డికరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో సోమవారం బిజెపి మండల శాఖ అధ్యక్షుడు నగునూరి శంకర్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా కోఆర్డినేటర్ మెంబర్ కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి హాజరై మండల కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందేశం కరపత్రాలను ప్రజలకు అందజేశారు అయినా మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం సుప్రీం కోర్టు ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని తెలిపారు,ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, పౌరసత్వ చట్టం సవరణ, సమర్థవంతంగా కరోనా కట్టడి, కరోనా నుండి పేద ప్రజలు వివిధ రంగాలను ఆదుకునేందుకు గరీబ్ కళ్యాణ్ యోజన, ఆత్మ నిర్భర భారత్ అభియాన్ కింద 20 లక్షల కోట్ల ప్యాకేజీ,భారత సరిహద్దు వివాదాలను పరిష్కరించే దౌత్యమ్, చిన్న సన్నకారు రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు అనేక పథకాలు, సంవత్సర కాలంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు గురించి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రతి బూతులో ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి వాటిని వివరించాలని కార్యకర్తలను కోరారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు జాలి శ్రీనివాస్ రెడ్డి, కాంతల శ్రీనివాస్ రెడ్డి,ముత్యాల జగన్ రెడ్డి బూట్ల జగన్,కూన మహేష్, పంబాల రాజశేఖర్, మచ్చ బాలరాజు తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post