కరోనా వ్యాధి ని ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చాలని గన్నేరువరం మండలకేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ముందు బిజెపి నాయకులు నిరసనకరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని సోమవారం బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ముందు బిజెపి మండల నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు హాజరై మాట్లాడుతూ కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని ప్రజలకు వైద్య ఖర్చులు భారం తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలన కరోనా కేసులు పెరుగుతున్నాయని అన్నారు లాక్ డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు మంత్రులు సమావేశాలు నిర్వహించడం ఎంతవరకు సబబు అన్నారు సరైన సమయం సరైన వైద్య పరీక్షలు PPE కిట్లు అందించకపోవడం వలన డాక్టర్లు కరోనా వ్యాధికి ప్రభావితం అయ్యిందని ఇప్పటికైనా ప్రతి గ్రామంలో కరోనా పరీక్షలు జరపాలని భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల శాఖ అధ్యక్షుడు నగునూరి శంకర్, ప్రధాన కార్యదర్శులు కాంతాల శ్రీనివాస్ రెడ్డి, జాలి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు బోయిని మల్లయ్య, మునిగంటి సత్తయ్య, గట్టు కిషన్, దాసరి కర్ణాకర్, దాసరి చంద్రయ్య, యువ మోర్చా నాయకులు కూన మహేష్, సతీష్, ప్రశాంత్, పత్తి అంజి,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Previous Post Next Post