ఆగస్టు మాసం నుంచి సీఎం జగన్ గ్రామాల పర్యటన....పథకం అందలేదని ఏ ఒక్కరు చేయెత్తినా అధికారులే బాధ్యులు: సీఎం జగన్అర్హత ఉన్నవారికి ప్రభుత్వ పథకాలన్నీ అందాలన్నదే తమ లక్ష్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందిస్తున్న సేవలు, అమల్లో ఉన్న విధివిధానాలపై ఆయన ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆగస్టు మాసం నుంచి గ్రామాల్లో పర్యటించనున్నట్టు సీఎం జగన్ వెల్లడించారు. తన పర్యటనలో ప్రజలను కలుస్తానని, సంక్షేమ పథకాలు అందలేదని ఏ ఒక్కరు చేయెత్తినా, ఫిర్యాదు చేసినా అందుకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మొదట పింఛన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలు ప్రజలకు అందేలా చూడాలని ఆదేశించారు. అర్హుల దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించాల్సిందేనని, తిరస్కరించవద్దని తెలిపారు.
Previous Post Next Post