ఏజన్సి ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.... బతికున్న శిశువుని చనిపోయినట్లు నిర్దారణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా,  భద్రాచలం: తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం నర్సింగ పురం గ్రామానికి చెందిన  6 నెలల గర్భవతి సునీతకు నెప్పులు రావడంతో శనివారం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. వైద్యులు సునీతను పరీక్షించి  స్కానింగ్ చేసి ఇద్దరు కవలలు వున్నారని అందులో ఒకరు చనిపోయారని అబార్షన్ చేయాలని చెప్పి  ఇద్దర్ని బయటకు తీసి ఇద్దరు శిశువులు చనిపోయినట్లు నిర్ధారించి కవర్లో పెట్టి బయట పడేసిన వైద్యులు. కవర్లో బాబు కదలడంతో బాబు బతికే వున్నాడని గుర్తించిన శిశువు తండ్రి.  చనిపోక ముందే కవర్లో పెట్టి  పడేశారని ఆందోళనకు దిగిన బంధువులు. ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు అంటున్న చుట్టుపక్కల ప్రజలు.  ఐటీడీఏ పీవో మరియు జిల్లా వైద్యాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.


Previous Post Next Post