సీతానగరం పీఎస్ లో దళితుడు వరప్రసాద్ పై దాష్టీకం - ఆగ్రహం వ్యక్తం చేసిన డీజీపీ గౌతమ్ సవాంగ్తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్ లో వరప్రసాద్ అనే దళితుడికి శిరోముండనం చేసిన ఘటనపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఘటన తీరుతెన్నులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆదేశించారు. ఇటువంటి వ్యవహారశైలిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. వరప్రసాద్ అనే యువకుడికి పోలీసుల సమక్షంలోనే శిరోముండనం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఇసుక అక్రమాలను ప్రశ్నించినందునే వైసీపీ నేతలు ఆ దళితుడ్ని అవమానించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Previous Post Next Post