తాళ్లకుంట మత్తడి ని సందర్శించిన టిఆర్ఎస్ మండల నాయకులుకరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చాకలివాని పల్లె పరిధిలోని తాళ్ల కుంట - ఈదులకుంట శుక్రవారం టిఆర్ఎస్ మండల నాయకులు న్యాత సుధాకర్ , స్థానిక సర్పంచ్ నక్క మల్లయ్య, యువజన విభాగం మానకొండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేష్ తో కలిసి చెరువును సందర్శించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ మనకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గన్నేరువరం మండల అభివృద్ధి పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిరంతరంగా  D8 కెనాల్ కాలువ ద్వారా తాళ్లకుంట, ఈదులకుంట కు నీరు  ఈ రెండు చెరువులతో గన్నేరువరం రైతాంగానికి ప్రయోజనం ఉంటుందని అన్నారు గతంలో రెండు కాలాల్లో ఎన్నడు రెండు చెరువులో నీళ్లు చూడలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్మించిన కాళేశ్వరం ద్వారా నీళ్లు రావడం ఆనందకరం అని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కూన సంపత్, టిఆర్ఎస్ యువజన సభ్యులు రాము, నదీమ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post