భద్రాద్రిలో భారీగా గంజాయి పట్టివేత


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం: ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో భద్రాచలం ఫారెస్టు చెక్ పోస్ట్ దగ్గర SI మహేష్ గారు తన సిబ్బంది, CRPF ఇన్స్పెక్టర్ సుందరం గారు మరియు తన  సిబ్బందితో వాహనాలు తనిఖీ చేయుచుండగా TS10EC6667 ఇన్నోవా వాహనం తనిఖీ చేయగా 200కేజీల గంజాయితో ఇన్నోవా వాహనంలో  బర్ల శ్రీకాంత్, అనిరుద్ మరియు వినయ్ లు తారసపడ్డారు. వారిని విచారించగా వారు ఒరిస్సా నుండి హైదరాబాద్ కు గంజాయి తరలిస్తున్నట్లు తెలిపినారు. ఈ గంజాయి విలువ 30 లక్షల రూపాయలు గా పట్టణ ఇన్స్పెక్టర్ కె. వినోద్ గారు తెలియచేసినారు. పట్టుబడిన ముగ్గురిని అరెస్టు చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఇన్స్పెక్టర్ వినోద్.

0/Post a Comment/Comments

Previous Post Next Post