గన్నేరువరంలో పలు గ్రామాలు సందర్శించిన యూనిసెఫ్ జిల్లా కోఆర్డినేటర్కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం  ఖాసీంపెట్,గుండ్లపల్లి,పారువెల్ల గ్రామాలు సెలెక్ట్ కాగా ఖాసింపెట గ్రామాన్ని సోమవారం యూనిసెఫ్ జిల్లా కోఆర్డినేటర్ కిషన్ స్వామి సందర్శించి తడి పొడి చెత్త సేకరణ,చెత్తను వేరు చేసే విధానం పై సర్పంచులకు, జీపీ కార్యదర్శులకు ,సిబ్బందికి అవగాహన కల్పించారు. ఇంకుడు గుంతలు, తడి పొడి చెత్త సేకరణ, మరుగు దొడ్లు ను పరిశీలించారు. సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న, పాలక వర్గ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో సర్పంచులు పుల్లెల లక్ష్మీ,తీగల మోహన్ రెడ్డి,బేతేల్లి సమత, రాజేందర్ రెడ్డి,ఎంపివో నర్సింహా రెడ్డి, ఉపసర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి,కో ఆప్షన్ సభ్యుడు రఫీ, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్, కార్యదర్శులు, జీ పీ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు

Previous Post Next Post