హైదరాబాదులో పోలీసు ఉన్నతాధికారుల హఠాన్మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి ..హైదరాబాదులో ఇద్దరు డీఎస్పీలు కొన్ని రోజుల వ్యవధిలోనే కన్నుమూయడం అధికార వర్గాల్లో విషాదం కలిగించింది. ఇటీవలే ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఆ ఘటన మరువక ముందే ఎక్సైజ్ డీఎస్పీ రాజేంద్ర కులకర్ణి కూడా హార్ట్ అటాక్ తో మృతి చెందారు. రాజేంద్ర కులకర్ణి 1995 బ్యాచ్ కు చెందిన అధికారి. ఆయన ఉప్పల్ లో నివాసం ఉంటున్నారు. ఇంతకుముందు చనిపోయిన డీఎస్పీ ప్రతాప్ కూడా అదే బ్యాచ్ కు చెందినవారు. ఇప్పటికే కరోనా భయం ముసురుకుంటున్న తరుణంలో హైదరాబాదులో పోలీసు ఉన్నతాధికారుల హఠాన్మరణాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
Previous Post Next Post