విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో ఘనంగా స్వర్గీయ డాక్టర్ వైయస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలురాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పరుగులెత్తేలా డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారని,ఆరోగ్యశ్రీ,ఫీజు రీఎంబేర్స్మెంటు వంటి పథకాలు ఆయన ప్రజల గుండెల్లో  శాశ్వతస్థానం కల్పించాయని,విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య రొక్కం సుదర్శన రావు గారు అన్నారు.గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక పథకాలు ప్రారంభించి అమలు చేశారని కితాబునిచ్చారు.బుధవారం విశ్వవిద్యాలయంలో వై.ఎస్.జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.వై.ఎస్ చిత్రపటానికి వైస్ ఛాన్సలర్  సుదర్శన రావు,రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి పులమాలను వేసి నివాళలు అర్పించారు. అనంతరం వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్ లోనే వై.ఎస్.హయాంలో ఏర్పాటైన ఆరు విశ్వవిద్యాలయాలు ఉన్నాయని చెప్పారు.విద్యా, ఉపాధి అందరకీ లభించాలని అభిలాషించారని కొనియాడారు.ఆయన చేపట్టిన కార్యక్రమాలకు స్పందన ఇప్పటికీ కనిపిస్తోందని,కరోనా మహమ్మారి ఉన్నా ఇంతమంది ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చారంటే ఉన్న అభిమానం రూఢీ అవుతుందని అన్నారు. యునివర్సిటీ రెక్టర్ ఆచర్య చంద్రయ్య మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి రాజశేఖర్ రెడ్డి పెద్ద పీట వేశారని చెప్పారు.పేదలు,బడుగు,బలహీనవర్గాలను అన్నీ విధాల అడ్డుకున్నారని చెప్పారు.రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి మాట్లాడుతూ పరిపాలనలో  వైఎస్ ట్రెండ్ సృష్టించారని అన్నారు.కార్మికులు, కర్షకులు, విద్యార్థులు,వృద్దులు,వికలాంగులు ఇలా సమాజంలో అన్నీ వర్గాలకు బాసటగా నిలిచారని చెప్పారు.ఉద్యోగులకు ఎలాంటి బకాయిలు లేకుండా చెల్లింపులు ఉండేవని గుర్తు చేశారు.ఉచిత విద్యుత్తు,తుంపరసేద్యానికి 90 శాతం  సబ్సిడీ రైతాంగానికి ఎంతో ఆసరాగా నిలిచాయని చెప్పారు .నీటిపారుదల ప్రాజెక్టులు పెద్ద ఎత్తున చేపట్టి స్వల్పకాలంలో కొన్నింటిని పూర్తి చేసిన ఘనత వై.ఎస్ కి దక్కుతుందని అన్నారు.ప్రభుత్వ రంగ సంస్థల బలోపేదం,పారిశ్రామికాభివృద్ధి వంటి అన్నీ రంగాలు వై.ఎస్ హయాంలో పురోగమించాయని గుర్తు చేసారు.ఉద్యోగ నియామకాలు,యూనివర్సిటీ లు,డిగ్రీ కాలేజీలు,చివరికి మెడికల్ కాలేజీలను కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని చెప్పారు.వై.ఎస్ చిత్రపటానికి యునివర్సిటీ అధికారులు,ఉద్యోగులు,విద్యార్థి నాయకులు పుష్పాంజలి ఘటించారు.కార్యక్రమంలో యునివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజ.ఎస్.నాయర్,డీన్ ఆచార్య విజయనందుకుమార్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Previous Post Next Post