విశాఖ ఫార్మా సిటీ ప్రమాదంలో ఒకరి మృతివిశాఖపట్టణంలోని పరవాడ ఫార్మా సిటీలో గత రాత్రి జరిగిన ప్రమాదంలో సీనియర్ కెమిస్ట్ నాగేశ్వరరావు (40) మృతి చెందిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు మాత్రమే ఉన్నారని, వీరిలో ముగ్గురు స్వల్పంగా గాయపడగా, మల్లేశ్ (33) తీవ్రంగా గాయపడినట్టు ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఉదయం పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న నాగేశ్వరరావు మృతదేహాన్ని శిథిలాల మధ్య గుర్తించారు. అయితే, ఇందుకు సంబంధించి ఇటు యాజమాన్యం కానీ, అటు పోలీసులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. నిజానికి పేలుడు జరిగిన సమయంలో నలుగురు మాత్రమే విధుల్లో ఉన్నారని విశాఖ సాల్వెంట్స్ యాజమాన్యం చెబుతున్నప్పటికీ నిజానికి ఆ సమయంలో 15 మంది వరకు విధుల్లో ఉన్నట్టు తెలుస్తోంది.
Previous Post Next Post