శ్రీ సీతారామాంజనేయ స్వామిని దర్శించుకున్న కరీంనగర్ కార్పొరేటర్ తోట రాములు


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానానికి సమీపంలో నూతనంగా వెలిసిన శ్రీ సీతారామాంజనేయ స్వామిని ఆదివారం కరీంనగర్ 12వ డివిజన్ కార్పొరేటర్ తోట రాములు సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా తోట రాములు మాట్లాడుతూ తనకు జన్మనిచ్చిన ఊర్లో పురాతన విగ్రహాలు బయట పడడం సంతోషంగా ఉందన్నారు శ్రీ సీతారామాంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు మైలారం గ్రామానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తానని హామీ ఇచ్చారు
Previous Post Next Post