తెలంగాణ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 95,700 - మృతుల సంఖ్య మొత్తం 719


తెలంగాణలో కరోనా కొవిడ్ కేసుల విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,763 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1789 మంది కోలుకున్నారు.  ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 95,700కు చేరింది. ఆసుపత్రుల్లో 20,990   మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 73,991 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 719కి చేరింది. జీహెచ్‌ఎంసీలో 484 మందికి కొత్తగా కరోనా సోకింది.  తెలంగాణలో మొత్తం 7,97,470 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.  
0/Post a Comment/Comments

Previous Post Next Post