రజితను చిత్రహింసలకు గురిచేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి : సిపిఐ నాయకుల డిమాండ్


నిరుపేద దళిత మహిళను ప్రేమ పేరుతో వంచించి గర్భవతిని చేసి, చిత్రహింసలకు గురిచేసిన మల్లేశ్ కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు శనివారం రోజున భర్త వేధింపులకు, చిత్రహింసలకు గురై చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ప్రతిమ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రజితను,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి జరిగిన విషయాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన నిరుపేద దళిత అమ్మాయి రజితను మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన శంఖం మల్లేశ్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేసి ఆడపిల్ల జన్మించిన తరువాత నీవు వెళ్లిపోవాలని  వారి కుటుంబ సభ్యులతో సహా చిత్రహింసలకు గురిచేసి 2 నెలల పసికందు అని చూడకుండా మూడ నమ్మకాల పేరుతో భూత వైద్యులను పిలిపించి చిత్రహింసలకు గురిచేసి, తీవ్రంగా కొట్టిన భర్త మల్లేశ్,మరియు భూత వైద్యున్ని  వారి కుటుంబ సభ్యులను వెంటనే అరెస్టు చేసి వారిని కఠినంగా శిక్షించాలని, రజితకు మెరుగైన వైద్యం అందించాలని,2 నెలల పాపకు సంరక్షణ కల్పించాలని సృజన్ కుమార్ కోరారు పరామర్శించిన వారిలో AIYF జిల్లా అధ్యక్షులు బ్రమాండ్లపల్లి యుగంధర్ ఉన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post