భారత్ లో బస్ హైజాక్‌ కలకలం - దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

 

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును కొందరు దుండగులు హైజాక్ చేయడం కలకలం రేపుతోంది. న్యూ సౌతెర్న్ బైపాస్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఆ సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హైజాక్ చేసింది ఎవర్న దానిపై విచారణ జరుపుతున్నారు. బైపాస్‌ రోడ్ వద్ద బస్సుని ఆపిన దుండగులు మొదట బస్సు డ్రైవర్‌, హెల్పర్‌ను కిందకు దించేసి, ఆ తర్వాత బస్సును హైజాక్ చేసినట్లు తెలిసింది. ఆ బస్సు హర్యానాలోని గురుగ్రామ్‌ నుంచి మధ్యప్రదేశ్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.


0/Post a Comment/Comments

Previous Post Next Post