కడప జిల్లాలో సీఎం జగన్ టూర్... షెడ్యూల్ వివరాలు ఇవిగో! ఏపీ సీఎం జగన్ రెండ్రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. సెప్టెంబరు 2న వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తన తండ్రి వర్థంతి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సెప్టెంబరు 1, 2 తేదీల్లో జగన్ పర్యటన సాగనుంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలో వైఎస్సార్ కు నివాళులు అర్పిస్తారు.


జగన్ పర్యటన షెడ్యూల్ వివరాలు


రేపు సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కడప పయనం

సాయంత్రం 5.15 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్ కు చేరుకోనున్న సీఎం జగన్

రాత్రికి ఇడుపులపాయలోనే బస

ఎల్లుండి ఉదయం 9.45 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ ఘాట్ కు పయనం

ఉదయం 10.30 గంటల వరకు నివాళులు, ప్రత్యేక ప్రార్థనలు

ఆపై కడప నుంచి గన్నవరం పయనం

మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న జగన్

కాగా, సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన పర్యటనలో పాల్గొనే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, మీడియా సిబ్బందికి ఇప్పటికే కరోనా పరీక్షలు నిర్వహించారు. సీఎం పర్యటన సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post