ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

 


జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. శ్రీనగర్‌లోని పంథా చౌక్ చెక్‌పోస్టు వద్ద విధుల్లో ఉన్న పోలీసు, సీఆర్‌పీఎఫ్ జవానుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి పరారయ్యారు. అప్రమత్తమైన స్థానిక భద్రతా సిబ్బంది పోలీసులతో కలిసి వారి కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో భద్రతా దళాలకు తారసపడిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ పోలీసు అధికారి అమరుడయ్యాడు. కాగా, గత మూడురోజుల్లో ఇప్పటి వరకు 10 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మరో ఉగ్రవాది లొంగిపోయాడు.

0/Post a Comment/Comments

Previous Post Next Post