పాకిస్తాన్ చొరబాటుదారులను హతమార్చిన భారత్ జవానులు

 

పంజాబ్‌లోని భార‌త్‌-పాకిస్థాన్ స‌రిహ‌ద్దు మీదుగా దేశంలోకి చొరబాటుకు ప్రయత్నించిన ఐదుగురిని బీఎస్‌ఎఫ్ బలగాలు హతమార్చాయి. ఈ రోజు ఉదయం 4.45 గంట‌ల‌కు పంజాబ్‌లోని తార్న్ తార‌న్ జిల్లా ఖెమ్‌క‌ర‌న్ బార్డ‌ర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐదుగురు వ్యక్తులు అక్కడి ప్రాంతంలో కనపడడంతో వారిని లొంగిపోవాలని బీఎస్ఎఫ్‌ జవాన్లు హెచ్చరించారు. దీంతో భ‌ద్ర‌తా బ‌ల‌గాలపై ఆ ఐదుగురు చొరబాటుదారులు కాల్పులకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలో వారిపై కాల్పులు జరిపి వారందరినీ బీఎస్‌ఎఫ్ జవాన్లు హతమార్చారు. వారి వద్దనుండి ఒక ఏకే 47 తుపాకీ , 4 పిస్టల్స్ , సెల్ ఫోన్లు , పాకిస్తాన్ కరెన్సీ లభించాయి . సరిహద్దుల వద్ద అనుమానాస్పద కదలికలు ఉండడంతో నిన్న రాత్రి నుంచి గస్తీ పెంచినట్లు అధికారులు వివరించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post