కరోనాతో మృతిచెందిన భద్రాచలం మాజీ ఎం ఎల్ ఎ జననేత మృతి - సంతాపం వ్యక్తం చేసిన మంత్రి పువ్వాడ


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం:  ఉమ్మడి ఖమ్మం  జిల్లా  భద్రాచలం నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు  కామ్రేడ్ సున్నం రాజయ్య సోమవారం రాత్రి కరొనతో మృతి చెందారు. స్వగ్రామం నుండి విజయవాడ హాస్పిటలకు తరలించగ అక్కడే చనిపోయారు. నిరాడంబరుడు, నిగర్వి, నిస్వార్ధపరుడు, జననేత, ప్రజల్లో ఒకడు, ప్రజల మనిషి ఐన రాజన్నకి   ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. సీపీఎం అభ్య‌ర్థిగా ఆయ‌న 1999, 2004, 2014లో భద్రాచలం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన నిత్యం ద్విచక్రవాహనం, ఆర్టీసీ బస్సుల్లోనే తిరుగుతు నిరాడంబర‌మైన జీవితాన్ని కొన‌సాగించారు. ప్రజా సమస్యల కోసం పోరాడిన‌ నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.  సున్నం రాజయ్య మరణించడం పట్ల తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. వారి మరణం తీరని లోటని ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.  వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాని తెలిపిన మంత్రి. రాజన్న అంత్యక్రియలు మంళవారం తూర్పుగోదావరి జిల్లాలోని వరవరాంచంద్రపురం మండలం సున్నంవారి గూడెంలో నిర్వహించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post