కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ


రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్ల గ్రామంలో శ్రీ విజయ సారథి డెవలప్మెంట్ సొసైటీ మహిళా కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ  మండల అధ్యక్షులు బెంద్రం తిరుపతి రెడ్డి వల్లంపట్ల సర్పంచ్  అనసూయ నరసింహారెడ్డి ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కుట్టు శిక్షణ ద్వారా స్వయం ఉపాధిని పొందాలని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో గ్రామానికి తీసుకురావాలని సెంటర్ నిర్వాహకులు అశ్విని గారిని ప్రోత్సహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెంద్రం తిరుపతిరెడ్డి గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రెండు పథకాలను బ్యాంకు రుణాలను సద్వినియోగం చేయవలసినదిగా మహిళలకు తెలియజేశారు సొల్లు అజయ్ వర్మ గారు మాట్లాడుతూ కుట్టు శిక్షణ నైపుణ్యం తో పాటు వివిధ రంగాలలో మహిళలు ముందుకు వెళ్లాలని స్వయం ఉపాధిని పొందాలని కుటుంబాన్ని సమాజంలో తమ గౌరవాన్ని పెంచుకోవాలని వారు అదేవిధంగా వివిధ నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి వారిని ప్రోత్సహించాలని సెంటర్ నిర్వాహకులను కోరడం జరిగింది   ఈ కార్యక్రమంలో శ్రీ విజయ సారథి డెవలప్మెంట్ సొసైటీ కార్యకర్తలు అనిల్ రెడ్డి, నాగసముద్రలా  సంతోష్, అనగొని అవినాష్, తిప్పారం శ్రావణ్, మామిడి హరీష్,  కొత్తపెళ్లి వీణ మరియు శిక్షణ కోసం వచ్చినటువంటి మహిళలు పాల్గొనడం జరిగింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post