అల్లుడి తల నరికి .. తలతో పోలీస్ స్టేషన్ కి వెళ్లిన మామ

 

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం డి జె పురం లో దారుణం చోటు చేసుకొంది.. కుమార్తె ను చంపాడు అన్న కోపంలో పల్లా సత్యనారాయణ అనేవ్యక్తి అల్లుడు లక్సమణరావు ను అత్యంత దారుణం గా హతమార్చాడు. అల్లుడు తల  నరికిన  మామ సత్యనారాయణ అన్నవరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. గత ఏడాది అనుమానాస్పద స్థితిలో  సత్యనారాయణ కుమార్తె మృతి చెందింది.అప్పటినుండి కుమార్తె పిల్లలు సత్యనారాయణ వద్ద ఉంటున్నారు.నిన్న రాత్రి అత్తారింటికి వచ్చాడు .మద్యం మత్తులో  భార్యను చజంపినట్లు మామ వద్ద   అల్లుడు ఒప్పుకొన్నాడు.దీంతో కోపోద్రోకుడైన మామ అల్లుడిని చంపి  తలతో సహా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్టు  సమాచారం . ఇంకా పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది .

0/Post a Comment/Comments

Previous Post Next Post