మద్యం దుకాణాల వేళల పొడిగింపు


తెలంగాణలో మద్యం దుకాణాల వేళలను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాత్రి 9.30 గంటల వరకు అనుమతి ఉండగా,  ఇప్పుడు దానిని మరో గంటన్నర పెంచారు. ఫలితంగా రాత్రి 11 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచే ఉండనున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. లాక్‌డౌన్ కారణంగా మూతబడిన మద్యం షాపులు మే ఆరో తేదీన తిరిగి తెరుచుకున్నాయి. తొలుత సాయంత్రం ఏడున్నర గంటల వరకే అనుమతి ఇవ్వగా, ఆ తర్వాత రెండు దఫాలుగా 9.30 గంటల వరకు సమయాన్ని పెంచారు. ఇప్పుడు మరో గంటన్నర పెంచిన ప్రభుత్వం రాత్రి 11 గంటల వరకు మద్యం అమ్ముకునే వెసులుబాటును కల్పించింది.  నిన్నటి నుంచే పెంచిన వేళలు అమల్లోకి వచ్చాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post